ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో సందడి చేస్తున్న ఎన్.టి.ఆర్

ఫ్యామిలీ సాంగ్ షూటింగ్లో సందడి చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Jan 18, 2014 12:39 PM IST

ntr-new-movie
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ చిత్ర టీం నేటి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మణికొండలోని గంధర్వమహళ్ లో జరుగుతోంది. సమంత కూడా ఈ రోజు ఈ చిత్ర టీంతో జాయిన్ అయ్యింది. ఆలాగే ఈ రోజు ఎన్.టి.ఆర్, సమంతలతో పాటు ఈ చిత్రంలోని ప్రధాన నటీనటులపై ఓ ఫ్యామిలీ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో ఎన్.టి.ఆర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ‘రభస’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు