హెవీ క్లైమాక్స్ సెషన్ లో తారక్, చరణ్.!

హెవీ క్లైమాక్స్ సెషన్ లో తారక్, చరణ్.!

Published on Feb 5, 2021 4:00 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తాలూకా షూట్ కు సంబంధించి కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ఇస్తూ వస్తున్నారు.

మరి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి భారీ క్లైమాక్స్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న మేకర్స్ లేటెస్ట్ గా ఒక కూల్ పోస్ట్ ను తమ ఫాలోవర్స్ తో పంచుకున్నారు. తమ భీం మరియు అల్లూరి గా చేస్తున్న తారక్ మరియు చరణ్ ల ఆన్ లొకేషన్ ఫొటోలతో ఒక పోస్ట్ పెట్టారు. తమ భారీ క్లైమాక్స్ సీన్ కోసం తీవ్రంగా కస్టపడి ఆ సెషన్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నామని తెలుపుతున్నారు.

మరి ఇప్పటికే ఈ సీన్ ను మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరియు భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్ గన్ అలాగే అలియా భట్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య 400 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు