యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి ఆంధ్రాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బి, సి సెంటర్లలో ప్రేక్షకులు అతని కోసమే సినిమాలకు వచ్చే సందర్భాలు ఎన్నో. ఓవర్సీస్ లో అతనికి ఏ సెంటర్ల ఫ్యాన్ బేస్ కుడా బానే ఉంది, కానీ నిజం చెప్పాలంటే అది అతని టాలెంట్ కి తక్కువే. ఇంకా అక్కడ ఫ్యాన్ బేస్ ని సాదించాల్సిన తరుణంలో ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ సినిమాని బ్రహ్మాస్త్రంగా వాడనున్నాడు.
శ్రీను వైట్ల వడ్డిస్తున్న కామెడీ విందు కారణంగా అతనికి అక్కడ ఫాన్స్ బానే ఉన్నారు. సో ఈ విషయాన్ని వాడుకుని ఎన్.టి.ఆర్ అక్కడి మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నాడు. ‘బాద్ షా’ సినిమాకి అక్కడ భారీ అంచనాలు ఉన్నాయి. ఏకంగా 120 స్క్రీన్లలో ప్రదర్శించబడుతుంది. ఎన్.టి.ఆర్ ఎలాగో కామెడీ పండించగలడు, శ్రీను వైట్ల ఆ కామెడీని సీన్ల రూపంలో చూపించగలడు. సో ‘బాద్ షా’ విజయం ఆపడం ఎవరితరం కాదేమో …