మరి కొద్దిరోజులలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ చిత్రంలో ఆయన కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ కోసం రాజమౌళి ఓ ప్రత్యేకమైన సెట్ వేయిస్తున్నారు. పరిమిత సిబ్బందితో, అందుబాటులో ఉన్న నటులతో కొన్ని సన్నివేశాల చిత్రీకణ జరగనుంది. కాగా ఈ మూవీతో పాటు ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీకి కమిటైన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయబోయే మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ డేట్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాను ఈ విజయదశమి సందర్భంగా సెట్స్ మీదకు తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీని ఫిక్స్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లోనే మొదలుపెట్టాలన్నది ప్లాన్ అయినప్పటికీ లాక్ డౌన్ కారణంగా అది కుదరలేదు. ఇక అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.