ఇంకా మెగాస్టారే మిగిలున్నారు.!

ఈ ఏడాది కరోనా వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామని ఎవరూ కూడా అసలు ఊహించే ఉండరు. ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలానే జరిగిపోయింది. ముఖ్యంగా అయితే సినీ పరిశ్రమకు చాలానే నష్టం వాటిల్లింది. ఇక ఏమైనప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుని మాత్రం మేకర్స్ తమ చిత్రాల షూటింగ్స్ ను మొదలు పెట్టేస్తున్నారు.

ఇపుడు మన టాలీవుడ్ లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలు షూటింగ్స్ జరిగిపోతున్నాయి. స్టార్ హీరోలు సైతం సెట్స్ లో అడుగు పెడుతున్నారు ఒక్క మెగాస్టార్ చిరంజీవి తప్ప. వారి కుటుంబం నుంచే చరణ్ ఇప్పటికే RRR షూట్ కు రెడీ అయ్యాడు. అలాగే పుష్ప కోసం బన్నీ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉండి నవంబర్ లో స్టార్ట్ చెయ్యనున్నారు.

కానీ చిరు కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న “ఆచార్య” షూట్ కు సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి సమాచారం లేదు. ఇంకా టెస్ట్ షూట్ ట్రైల్స్ కూడా స్టార్ట్ అయ్యాయో లేదో అన్నది కూడా తెలియాల్సి ఉంది ఉంది. దీనితో అనేక మంది హీరోలు ఆల్రెడీ షూటింగ్స్ స్టార్ట్ చేసేసి, చెయ్యడానికి రెడీ అవుతుండగా మెగాస్టార్ నుంచే ఇంకా ఎలాంటి సూచనలు లేవు. మరి చిరు ఎప్పుడు షూట్ షురూ చేస్తారో చూడాలి.

Exit mobile version