నాని సినిమా పై వస్తోన్న రూమర్స్ లో నిజం లేదట !

నాని సినిమా పై వస్తోన్న రూమర్స్ లో నిజం లేదట !

Published on Aug 16, 2020 2:14 AM IST

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కలయికలో టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న సినిమా ‘వి’. కాగా చిత్రం ఓటిటిలోకి రాబోతుందని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం వాటిలో నిజం లేదట. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ భారీ మొత్తం ఆపర్ చేసినా చిత్రబృందం తాం సినిమాని నేరుగా థియేటర్స్ లోనే రిలీజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది.

ఇక ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు. అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. ఇక హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్రంగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

తాజా వార్తలు