రామయ్యా వస్తావయ్యాలో ఐటెం సాంగ్ లేదు.!

రామయ్యా వస్తావయ్యాలో ఐటెం సాంగ్ లేదు.!

Published on Oct 2, 2013 4:45 PM IST

RV
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అంతా ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చెయ్యడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబందించిన సెన్సార్ కార్యక్రమాలు అక్టోబర్ 5న జరిగే అవకాశం ఉంది.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్యాచీగా ఉండే ట్యూన్స్, వేగంగా సాగే లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని ఆశిస్తున్న అభిమానులు నిరుత్సాహపడేలా ఈ సినిమాలో ఐటెం సాంగ్ లేదని డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపాడు. ఈ సినిమాలో ఎలాంటి ఐటెం సింగ్ లేదని కానీ ప్రతి ఒక్క సాంగ్ విజువల్ గా చూడటానికి చాలా బాగుంటుందని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రల్లో కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు