మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ ‘మూవీ పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి దీపావళి పండుగకు ఓ సర్ప్రైజ్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సర్ప్రైజ్ను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ సూపర్ పాటను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఇంకా ఫైనల్ ఔట్పుట్ రాకపోవడంతో ఈ పాట రిలీజ్‌ను వాయిదా వేశారట.
ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.