తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించే చిత్రాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి వచ్చిన లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(LCU)లో ఇప్పటికే సెన్సేషనల్ బ్లా్క్బస్టర్స్గా నిలిచాయి. ఇక ఆయన నిర్మాతగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెంజ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘బెంజ్’ చిత్రాన్ని బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా LCUలో భాగంగానే రానుందని మేకర్స్ తెలిపారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మలయాళ హీరో నివిన్ పౌలీ కూడా నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘వాల్టర్’ అనే పవర్ఫుల్ పాత్రలో విలన్గా నివీన్ పౌలీ నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
LCUలో నివిన్ పౌలీ వాల్టర్ పాత్రతో ఎంట్రీ ఇస్తుండటంతో ఈ పాత్ర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.