యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కెరీర్లో చేసిన సినిమాల్లో ఒక లైఫ్ కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ళు కితమే ఇప్పుడు జెనరేషన్ కి తగ్గట్టు సినిమాలు చేసేసిన కమల్ హాసన్ ట్రావెల్ లో కొందరు దర్శకులు వారితో చేసిన సినిమాలు అయితే ఇప్పటికీ క్లాసిక్ గా నిలిచిపోయాయి. అయితే అదే క్లాసిక్ సినిమాలతో ది బెస్ట్ వర్క్ అందించిన దర్శకులు మళ్ళీ అదే కమల్ హాసన్ తో వరస్ట్ వర్క్ అందించడం అనేది ఒకింత బాధాకరం.
మరి ఆ దర్శకులు ఎవరో కాదు తమిళ సినిమా దగ్గర దర్శకులు శంకర్ అలాగే మణిరత్నంలు. శంకర్ తో చేసిన “భారతీయుడు” సినిమా ఒక సంచలనం. అందులో తన నటన గాని శంకర్ టేకింగ్ ఆ పాటలు ఒక అద్భుతం. అలాంటి సినిమా చేసిన వీరు మళ్ళీ ఎన్నో ఏళ్ళు తర్వాత కలిసి “భారతీయుడు 2” తో ఊహించని విధంగా డిజప్పాయింట్ చేశారు.
ఇక మణిరత్నంతో అయితే అంతకు మించిన క్లాసిక్ “నాయకుడు” చేయగా అది కూడా ఒక అద్భుతం. అందులోని సోల్ కి ఇపుడు తరం చూసినా ఫ్యాన్స్ అవుతారు. అలాంటి కాంబినేషన్ లో వచ్చిన “థగ్ లైఫ్” మినిమమ్ మార్కులు కూడా ఆడియెన్స్ నుంచి సొంతం చేసుకోలేకపోయింది. ఇలా ఇద్దరు దిగ్గజ దర్శకులతో కమల్ కెరీర్ లో అంతే ది బెస్ట్ వర్క్స్ తో పాటుగా అంతే వరస్ట్ వర్క్స్ వచ్చాయని చెప్పక తప్పదు.