అక్కినేని అఖిల్-జయినాబ్ రిసెప్షన్ కార్డ్ చూశారా..?

అక్కినేని అఖిల్-జయినాబ్ రిసెప్షన్ కార్డ్ చూశారా..?

Published on Jun 8, 2025 1:00 AM IST

అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి వాతావరణం నెలకొంది. యంగ్ హీరో అఖిల్ పెళ్లి ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవడ్జీ కూతురు జయినాబ్ రవడ్జీని ప్రేమ వివాహం చేసుకున్నాడు అఖిల్. దీంతో ఈ పెళ్లి ఇరు కుటుంబాల అంగీకారంతో చాలా సింపుల్‌గా జరిపారు.

ఇక ఇప్పుడు వీరి రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఇరువురి కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. అఖిల్-జయినాబ్ ల రిసెప్షన్ వేడుకను జూన్ 8న సాయంత్రం 7.30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ పేర్కొంది.

ఈ రిసెప్షన్ వేడుకను అన్నపూర్ణ స్టూడియో అన్నెక్స్‌లో నిర్వహిస్తున్నట్లు వారు తమ ఆహ్వానపత్రికలో ప్రచురించారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు