నితిన్ ఇటీవల వదులుకున్న ఒక సినిమాని మంచు మనోజ్ చేయబోతున్నాడు. నిఖిల్ తో ‘వీడు తేడా’ అనే సినిమా తీసిన చిన్ని కృష్ణ మాలి ప్రయత్నంగా ఒక సబ్జెక్ట్ నితిన్ కి చెప్పగా నితిన్ కూడా అంగీకరించాడు. అయితే ఏమయిందో తెలియదు కానీ సినిమా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. ఇదే సినిమాని మంచు మనోజ్ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. నవంబర్ నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మనోజ్ ఇటీవలే ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాలో నటించాడు.