మన తెలుగు బుల్లితెర దగ్గర సెన్సేషనల్ గ్రాండ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. ఇండియా లోనే హైయెస్ట్ రేటింగ్ మన తెలుగు వెర్షన్ కి సొంతం అందుకే తెలుగు బిగ్ బాస్ షో పరంగా చాలా కేర్ ఉంటుంది. ఇలా మొత్తం 8 సీజన్స్ విజయవంతంగా ముగిసిన తర్వాత ఇప్పుడు వస్తున్న తొమ్మిదో సీజన్ పట్ల మంచి హైప్ నెలకొంది.
ఈసారి సామాన్యులు, ఎంటర్టైన్మెంట్ తారలు కలిసి ఆడియెన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నారు. ఇలా ఈసారి ఎవరెవరు కనిపిస్తారు అనేది మరింత ఆసక్తిగా మారగా నేడు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేందుకు ఒకొక్కరు సిద్ధం అయ్యారు. ఇలా వచ్చిన వారి లిస్ట్ చూసినట్టు అయితే.
తారలు/ ఇన్ఫ్లూయెన్సర్స్:
1. ‘నువ్వు నాకు నచ్చావ్’ నటి ఫ్లోరా సైని
2. ‘అగ్ని పరీక్ష’ సీరియల్ నటి తనూజ పుట్టస్వామి
3. ‘జబర్దస్త్’ ఫేమ్ ఇమ్మానుయేల్
4. ‘రాను బొంబాయ్ కి రాను’ ఫేమ్ రాము రాథోడ్
5. ‘బుజ్జిగాడు’ నటి సంజన గల్రాని
6. సీరియల్ నటి రీతూ చౌదరి
7. డాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
8. నటుడు భరణి శంకర్
9. కమెడియన్ సుమన్ శెట్టి
10. ప్రియా శెట్టి
సామాన్యులు:
1. శ్రీజ దమ్ము
2. డెమోన్ పవన్
3. హరిత హరీష్
4. కళ్యాణ్ పడాలా
5. మనీష్ మర్యాద
వీరు అంతా ఇక నుంచి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగనున్నారు. మరి వీరి జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.