ఇటీవలే ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని హిట్ ట్రాక్ ఎక్కిన హీరో నితిన్ రెట్టించిన ఉత్సాహంతో తన తర్వాతి సినిమా ‘రంగ్ దే’ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ తన పూర్తి సమయాన్ని ఈ సినిమా కోసమే కేటాయించారు. దీంతో చిత్రీకరణ స్పీడ్ అందుకుంది. మే లేదా జూన్ నాటికి షూటింగ్ ముగించేయాలని దర్శకుడు వెంకీ అట్లూరి భావిస్తున్నారు.
ఇక సినిమాను జూలై ఆఖరు లేదా ఆగష్టు ఆరంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఈ చిత్రం పూర్తిస్థాయి ప్రేమ కథగా ఉండనుంది. ఇందులో నితిన్ సరసన స్టార్ నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.