యంగ్ హీరో నితిన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. ఈ సినిమాని నవంబర్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమా రిలీజ్ కోసం నవంబర్ మొదటి వారంలో ఓ డేట్ ని పరిశీలిస్తున్నారు. యామి గౌతం హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి ప్రభుదేవా దగ్గర పనిచేసిన ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సరికొత్త పాయింట్ ని చూపించనున్నారు, అలాగే నితిన్ కూడా ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. సింగర్ కార్తీక్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. నితిన్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హార్ట్ అటాక్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.