విడుదల తేదీ : జూలై 04, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, సౌరబ్ తదితరులు
దర్శకత్వం: వేణు శ్రీరామ్
నిర్మాత : శిరీష్
సంగీతం : అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ : కెవి గుహన్, సమీర్, సేతు
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యూత్ స్టార్ నితిన్ హీరోగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “తమ్ముడు”.
కథ:
జై (నితిన్) తను వరల్డ్ ఆర్చరీ (విలు విద్య) లో ఛాంపియన్ కావలనుకుంటాడు. కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీనితో తను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడు అనేది గతంలో తన కుటుంబం అక్క స్నేహాలత (లయ) విషయంలో జరిగిన ట్రాజడీ అని తెలుసుకుంటాడు. దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్ర (వర్ష బొల్లమ్మ) తో తన అక్క, కుటుంబం అంబరాలగుడి అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని స్టార్ట్ అవుతాడు. ఇంకోపక్క వైజాగ్ లో జరిగిన ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం దాని ఓనర్ అజర్వాల్ (సౌరబ్) దాని నుంచి తప్పించుకోడానికి చేసే ప్రయత్నాలు ఏంటి? దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి? నితిన్ తన అక్కతో కలిసాడా లేదా? చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణాల కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
నితిన్ తన రోల్ లో డీసెంట్ పెర్ఫార్మన్స్ ని అందించాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్ తనపై ఓకే అనిపిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో తనపై యాక్షన్ సన్నివేశాలు, ఓ సాంగ్ లో బాగా కనిపించాడు.
వర్ష బొల్లమ్మ మంచి రోల్ దక్కించుకుంది. తనపై యాక్షన్ సన్నివేశాలు సహా నితిన్ తో ఎమోషనల్ బాండ్ ఓకే అనిపిస్తుంది. ఇక వీరితో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లయ మంచి రోల్ లో కనిపించారు.
అందుకు తగ్గట్టుగా ఆమె చేసిన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ బాగుంది. అలాగే విలన్ నటుడు సౌరబ్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి పాత్రల కంటే బెటర్ గా అనిపిస్తుంది. తన రోల్ ని కూడా సౌరబ్ అంతే సాలిడ్ పెర్ఫార్మన్స్ అందించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసే అంశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. అసలు కథనం సినిమాకి పెద్ద మైనస్. ఆడియెన్స్ కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ అసలు కనిపించవు. అలా ఏదో వెళుతుంది అన్నట్టుగా సినిమా సాగుతుంది.
ఫస్టాఫ్ ఓకే ఏదో కొంచెం పర్లేదు అనుకుంటే సెకండాఫ్ అయినా బెటర్ గా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. లాజిక్ లేకుండా డిజప్పాయింట్ గా కొనసాగుతాయి. చాలా వరకు సన్నివేశాలు కూడా సెన్స్ లెస్ గా ఉన్నాయి. సెకండాఫ్ లో ఓ సన్నివేశం ఉంటుంది.
చుట్టూ పెద్ద ఎత్తున మంటలు మధ్యలో నితిన్ పై యాక్షన్ సీన్ అందులో ఒకామెకి డెలివరీ అసలు ఇందులో లాజిక్ లేనే లేదు. అలాగే క్లైమాక్స్ లో ల్యాండ్ మైన్ సీన్ కూడా ఇలానే ఉంటుంది. పోనీ ఎమోషనల్ గా అయినా సినిమా కనెక్ట్ అవుతుందా అంటే అది కూడా ఉండదు.
ఇంకా నితిన్ పాత్ర ఒక మొటివ్ తో స్టార్ట్ అవుతుంది కానీ అందులో క్లారిటీ లోపించింది. విలన్ రోల్ కూడా మరీ అంత స్ట్రాంగ్ గా అనిపించదు. ఇంకా సప్తమి గౌడపై కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా చిరాకు తెప్పిస్తాయి. ఇంకో పెద్ద మైనస్ అజనీష్ లోకానాథ్ సంగీతం.పాటలు మినహా నేపథ్య సంగీతం ఆల్రెడీ వినేసినట్టే ఉంటాయి.
సాంకేతిక వర్గం:
సినిమాలో మేకర్స్ ఖర్చు బాగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బానే ఉంది. అయితే వి ఎఫ్ ఎక్స్ కొన్ని చోట్ల బెటర్ గా చేయాల్సింది. అజనీష్ లోకానాథ్ సంగీతం యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే.. తాను అక్క, తమ్ముళ్ల నడుమ ఒకరిని అర్జునిగా ఒకరిని ధర్మం కోసం నిలబడే వారిగా డిజైన్ చేసుకున్నారేమో కానీ ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేదు, కథా కథనాలు కూడా చాలా బోరింగ్ గా తను నడిపించారు. వీటితో తన కెరీర్ లోనే తమ్ముడు ఒక వీక్ వర్క్ అని చెప్పక తప్పదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ “తమ్ముడు” సినిమా ఒక మిస్ ఫైర్ అయ్యిన బిలో యావరేజ్ ఫ్లిక్ అని చెప్పాలి. నితిన్ సేవియర్ అయ్యే ప్రయత్నం చేసాడు కానీ కథా, కథనాల్లో బలం లోపించింది సో ఈ సినిమాలో మెప్పించే అంశాల కంటే నొప్పించే అంశాలే ఎక్కువ కనిపిస్తాయి. సో ఈ సినిమా అంత ఎంటర్టైన్ చేయదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team