టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ “వారణాసి”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
అయితే, ఈ సినిమాకు ఖర్చు చేసే బడ్జెట్ వివరాలపై సినీ సర్కిల్స్ పలు లెక్కలు తేల్చాయి. ఈ సినిమాకు మహేష్ బాబు లాభాల్లో షేర్ తీసుకోనున్నాడు. అటు దర్శకుడు రాజమౌళి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇక ప్రియాంక చోప్రా జోనస్‌కు మాత్రం భారీ పారితోషికం ఆఫర్ చేసినట్టుగా పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆమెకు రూ.30 – రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ నిర్ణయించినట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అంతేకాకుండా, మలయాళ స్టార్ ప్రిథ్వీరాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఆయనకు రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద “వారణాసి” చిత్ర బడ్జెట్ రూ.1,100-రూ.1,500 కోట్ల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
