సౌత్ సినిమాపై నెట్ ఫ్లిక్స్ నుంచి ఊహించని ట్విస్ట్?

ప్రపంచ దిగ్గజ ఓటిటి స్ట్రీమింగ్ సంస్థల్లో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఉండే రీచ్ మరో ప్లాట్ ఫామ్ లో దక్కదు అనే చాలామంది స్టార్స్ తమ సినిమాలు నెట్ ఫ్లిక్స్ కే ఇవ్వాలని చూస్తారు. ఇలా మన దక్షిణాది సినిమా నుంచే పలు సినిమాలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక సాలిడ్ రీచ్ అందుకున్నాయి. అయితే ఇదే నెట్ ఫ్లిక్స్ ఇపుడు సౌత్ సినిమా విషయంలో షాకింగ్ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక నుంచి దక్షిణాది సినిమాకి సంబంధించి సినిమాలు చాలా తక్కువ తీసుకోవాలని వారు డిసైడ్ అయినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ కొన్ని సినిమాలు ఎక్కువ ధరలకు కొనే బదులు ఆ డబ్బుతో తాము సొంతంగా ఒరిజినల్ కంటెంట్ ని అంటే వెబ్ సిరీస్ లు సినిమాలు చేసుకునే ప్లానింగ్ లో ఉన్నారట.

ఈ మధ్య కాలంలో ఆల్రెడీ పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్ తో డీల్ అయినప్పటికీ థియేటర్స్ లో ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో నెట్ ఫ్లిక్స్ వారికి నిర్మాతలకి ఇబ్బందులు ఎదురయ్యాయి. సో అందుకే ఇక నుంచి నెట్ ఫ్లిక్స్ దక్షిణాది సినిమా విషయంలో మాత్రం ఇదొక ఊహించని ట్విస్ట్ అనే చెప్పక తప్పదు.

Exit mobile version