రాజమౌళి స్పందిస్తారా?

varanasi

నిర్మొహమాటంగా భారతీయ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టిన టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. కానీ రాజమౌళి నుంచి నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాబోతున్న మొదటి చిత్రం వారణాసి సినిమా గ్రాండ్ ఈవెంట్ లో చేసిన పలు కామెంట్స్ మాత్రం ఇప్పుడు అంతకంతకు చర్చగా వెళుతూనే ఉన్నాయి. హనుమాన్ చేసిన వ్యాఖ్యలు చాలామంది మనోభావాలు దెబ్బ తీయడంతో సోషల్ మీడియాలో నెగిటివిటీ అంతకంతకూ ఎక్కువ అవుతూ వస్తుంది.

ఇక ఇక్కడ నుంచి జక్కన్న పాత స్టేట్మెంట్స్ కూడా తెచ్చి వైరల్ చేస్తున్నారు కొందరు. కానీ ఆరోజు నుంచి ఇప్పుడు వరకు రాజమౌళి నుంచి మాత్రం మరో మాట బయటకి రాలేదు. ఇప్పటికే ఇది ఎటు వెళుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. సో ఈ అన్నిటికి చెక్ చెప్పే విధంగా రాజమౌళి ఏమన్నా మాట్లాడుతారా లేక చివరి వరకు మౌనం గానే కొనసాగుతారా అనేది వేచి చూడాలి.

Exit mobile version