విడుదల తేదీ : నవంబర్ 21, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రియదర్శి పులికొండ, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకుడు : నవనీత్ శ్రీరామ్
నిర్మాతలు : జాన్వీ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీత దర్శకుడు : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్ : విశ్వనాథ్ రెడ్డి
ఎడిటర్ : రాఘవేంద్ర తిరున్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా ఆనంది హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ రోమ్ కామ్ డ్రామానే “ప్రేమంటే”. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
మధుసూదనరావు (ప్రియదర్శి) అలాగే రమ్య (ఆనంది) ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత ఓ మూడు నెలలు ఇద్దరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ తర్వాత మధు విషయంలో రమ్యకి ఒక షాకింగ్ నిజం తెలియడంతో ఆమె అతన్ని వదిలెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది. కానీ మధు మాత్రం ఒక్క చివరి అవకాశం కోరుతాడు. అలాగే మరో ఘటన తర్వాత ఆమె తీసుకున్న ఓ నిర్ణయం అతన్ని మరింత షాక్ కి గురి చేస్తుంది. మరి ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటి? అసలు మధుసూదన్ బ్యాక్ స్టోరీ ఏంటి? ఆమె ఏం తెలుసుకుంది. ఈ ఇద్దరి మధ్యలో హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ) ఎంటర్ అయ్యాక ఏం జరిగింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ముందు కొన్ని డిజప్పాయింట్మెంట్ సినిమాలు తర్వాత నటుడు ప్రియదర్శి నుంచి ఇదొక రిలీఫ్ అనే చెప్పాలి. వాటితో పోలిస్తే ఈ సినిమా బెటర్ ఎంపిక అని చెప్పొచ్చు. ఇక అదే కాకుండా ఈ సినిమా సబ్జెక్టుకి తగ్గట్టుగా ప్రియదర్శి మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. డీసెంట్ కామెడీ టైమింగ్, కొన్ని సీరియస్ సన్నివేశాల్లో మంచి నటన ప్రదర్శించాడు.
అలాగే హీరోయిన్ కయల్ ఆనందికి ప్లెజెంట్ రోల్ దక్కింది అని చెప్పాలి. మంచి హోమ్లీ లుక్స్ తో నాచురల్ పెర్ఫామెన్స్ ని ఆమె అందించింది. అలాగే ఆమెపై కొన్ని మూమెంట్స్ కూడా ఊహించని విధంగా ఉంటాయి. కథనం నడిచే కొద్దీ ఆమె పాత్ర మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఇద్దరు కలిపి స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీతో కనిపించారు. అలాగే ఇద్దరిపై స్టార్టింగ్ సహా కొన్ని సన్నివేశాలు వారి బాండింగ్ పై కనిపించినవి ఆహ్లాదంగా అనిపిస్తాయి.
ఇక యాంకర్ సుమ విషయానికి వస్తే.. తాను చాలా సెలెక్టీవ్ గానే పాత్రలు చేస్తూ ఉంటారు. అలా ఈ సినిమాలో ఆమె చేసిన కానిస్టేబుల్ పాత్ర కూడా మంచి మార్క్ లో కనిపిస్తుంది. ఆమె కామెడీ టైమింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫుల్ లెంగ్త్ లో ఆమె తన రోల్ లో మెప్పించారు. అలాగే వెన్నెల కిషోర్ తో కలిపి తమ కాంబినేషన్ లో సీన్స్ మరింత ఫన్ ని పంచుతాయి.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఫస్టాఫ్ అంతా సజావుగా వెళ్ళిపోతుంది. నిజానికి ఫన్, రొమాన్స్ లు బాలన్స్డ్ గా కనిపిస్తాయి. కానీ సెకాండాఫ్ మొదలైన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. కథనం బాగా సాగదీతగా వెళుతుంది. ముందు వెళ్లినంత ఈజ్ గా సెకండాఫ్ లో కథనం ముందుకు సాగలేదు.
అలాగే సెకండాఫ్ లో కథనం బాగా డిజైన్ చేసుకోలేదు. పలు సీన్స్ లాజిక్ లేకుండా ఎక్కువ లిబర్టీ తీసుకొని సిల్లీగా నడిపించేసినట్టు అనిపిస్తుంది. ఇవి ఒకింత ఫన్ గా ఉండొచ్చు కానీ పొంతన లేకుండా ఉండేసరికి అంత ఇంపాక్ట్ ఏమి చూపించవు. ఇక ఒక సమయం తర్వాత సుమ కామెడీ ట్రాక్ రిపీటెడ్ గా అనిపిస్తుంది.
వాటిని అవసరమైనంత వరకే పరిమితం చేసి ఉంటే బాగుండేది. అలాగే హైపర్ ఆది, రామ్ ప్రసాద్ లని సరిగ్గా వాడుకోలేదు. అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. నాచురాలిటీ అందులో మిస్ అయ్యింది.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. విశ్వంత్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం ప్లెజెంట్ గా ఉంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బాగుంది. సెకండాఫ్ లో కూడా ఇలానే మైంటైన్ చేసి ఉంటే బాగుండేది.
ఇక దర్శకుడు నవనీత్ శ్రీరామ్ విషయానికి వస్తే.. సినిమాకి తన ఆలోచన బాగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో దానిని క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడంలో తాను తడబడ్డారు అని చెప్పక తప్పదు. మెయిన్ గా సెకండాఫ్ ని బెటర్ గా మైంటైన్ చేయాల్సింది. సో తన వర్క్ పర్లేదు అని చెప్పొచ్చు కానీ ముందు సినిమాలకి బెటర్ చేసుకోవాలి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘ప్రేమంటే’ చిత్రం అక్కడక్కడా మెప్పించే క్రైమ్ రోమ్ కామ్ అని చెప్పొచ్చు. లీడ్ జంట మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. వారి పాత్రలు బాగున్నాయి. అలాగే సుమ, వెన్నెల కిషోర్ ల ఫన్ ట్రాక్ కూడా బానే ఉంది. కానీ ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన బ్యాలన్స్ సెకండాఫ్ లో మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఇలా కొన్ని లాజిక్స్ లాంటివి పక్కన పెట్టి కేవలం కామెడీ కోసం చూడాలి అనుకుంటే తక్కువ అంచనాలతో ఈ సినిమా వారాంతానికి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
