హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవ ‘తమ్ముడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తమ్ముడు’ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్, యాక్షన్ అంశాలతో కనిపిస్తుంది. అక్కకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు తమ్ముడు చేసిన యుద్ధమే ఈ చిత్ర కథగా మనముందుకు రాబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నితిన్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అక్కా-తమ్ముడు సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉన్నట్లు మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్‌లోని పలు డైలాగులు కూడా బాగా పేలాయి. దీంతో ఈ సినిమాతో నితిన్ సాలిడ్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ, సౌరబ్ సచ్‌దేవ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి