ఆగిపోయిన నితిన్-శ్రీనివాస్ రెడ్డి సినిమా

ఆగిపోయిన నితిన్-శ్రీనివాస్ రెడ్డి సినిమా

Published on Mar 18, 2014 8:16 PM IST

Nithin
యంగ్ హీరో నితిన్ తో కలిసి కొత్త దర్శకుడు శ్రీనివాస రెడ్డి ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభించారు. కొంత కఠినమైన వాతావరణంలో ఈ చిత్రం కొన్ని సన్నివేశాలు పూర్తి చేసుకుంది. అయితే మాకందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర వర్గాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు రావటం వలన ఈ సినిమా రద్దు అయ్యింది.

సోనుసూద్ విలన్ గా, శ్రవణా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితిన్ సోదరి నిఖితా రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ప్రస్తుతం నితిన్ కరుణాకరన్ దర్శకత్వంలో తన స్వీయ నిర్మాణం లో నిర్మిస్తున్న ఓ రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నారు.

గత కొద్ది రోజుల క్రితం వెంకటేష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ రాధా’ కూడా ఆగిపోయింది.

తాజా వార్తలు