పెళ్ళికి ముందు ఆ సినిమా పూర్తి చేయనున్న నిహారిక.

పెళ్ళికి ముందు ఆ సినిమా పూర్తి చేయనున్న నిహారిక.

Published on Jun 20, 2020 10:31 AM IST

నిహారికి పెళ్ళికి సర్వం సిద్ధం అయ్యింది. గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డను ఆమె వివాహం చేసుకొన్నారు. వీరికి ఆగస్టులో నిశ్చితార్ధం, ఆ వెంటనే పెళ్లికూడా జరగనుంది. నిహారిక-చైతన్య కలిసివున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ లోపు నిహారిక తన చివరి చిత్రం పూర్తి చేయనుంది.

ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ మై కడవులే ఫేమ్ అశోక్‌సెల్వన్‌ హీరోగా నటిస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ స్వాతి ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది. జె.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ సంబంధాల ప్రాముఖ్యతను తెలిపేలా కాస్త కామెడీని మేళవించి రూపొందిస్తున్నట్టు సెల్వకుమార్‌ తెలిపారు. గతంలో నిహారిక తమిళంలో ‘ఒరు నల్ల నాళ్ పాతు సొల్రెన్‌’ అనే మూవీలో నటించింది. ఇక తెలుగులో ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ మరియు సూర్యకాంతం సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు