టాలీవుడ్లో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై నిధి చాలా అంచనాలు పెట్టుకుంది.
ఈ సినిమా కోసం ఆమె చాలా ఏళ్లుగా కష్టపడుతోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవడంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో నిధి ఫుల్ జోష్‌తో పాల్గొంటుంది. ఆమె ఈ సినిమా కోసం చూపిస్తున్న డెడికేషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఆమె ఒక్కరోజులో 15 కి పైగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఒక్కో ఇంటర్వ్యూ 30 నిమిషాలు ఉన్నా, దాదాపు 8 గంటలు కూర్చునే ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని అభిమానులు అంటున్నారు.
ఇలా తన కెరీర్‌కు ఎంతో కీలకంగా మారనున్న సినిమా కోసం ఆమె పడుతున్న కష్టం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె చాందని అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను జూలై 24న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.