‘తెలుసు కదా’ టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను హీరోయిన్ రాశి ఖన్నా ముగించుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఇక ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే అనౌన్స్‌మెంట్‌ను సెప్టెంబర్ 9న ఉదయం 11.11 గంటలకు చేయనున్నారు.

ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version