బుక్ మై షోలో ‘లిటిల్ హార్ట్స్’ తుఫాన్..!

టాలీవుడ్‌లో గత శుక్రవారం రిలీజ్ అయిన చిత్రాల్లో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మౌళి తనూజ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే మంచి టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం కోసం యూత్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కేవలం బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లోనే ఈ చిత్రానికి 3 రోజుల్లో ఏకంగా 290,000కి పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్‌గా నటించగా రాజీవ్ కనకాల, అనిత చౌదరి, కాంచి, సత్యకృష్ణణ్, జై కృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను వంశీ నందిపాటి, బన్నీ వాస్ సంయుక్తంగా రిలీజ్ చేశారు.

Exit mobile version