పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘డిజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం

‘డిజే టిల్లు’తో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు విమల్ కృష్ణ, కొంత విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం చిలకా ప్రొడక్షన్స్‌లో రూపొందుతోంది. ఈ సినిమాలో రాగ్ మయూర్ హీరోగా నటిస్తుండగా మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం, సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీ, జె.కె. మూర్తి ఆర్ట్ డైరెక్షన్, అభినవ్ కూనపరెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. నిర్మాతలు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్, నవీన్ చంద్ర ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా మేఘ చిలక మరియు స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు.

Exit mobile version