తెలుగు నటి కష్ట సమయంలో ఆ నిర్మాత సాయం..!

తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న యువ నటి రేఖా బోజ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అయితే, ఆమె ఇటీవల తన తండ్రికి సర్జరీ అవసరం ఉందని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఓ తెలుగు నిర్మాత ఆమెకు సాయం అందించినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.

ఇదే విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్‌లోనూ రివీల్ చేసింది. ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య చికిత్స కోసం భారీ ఖర్చు అవసరమైందని.. ఈ సందర్భంలో ముందుకు వచ్చి రేఖా కి ఆర్థిక సహాయం అందించారట ఓ తెలుగు నిర్మాత. ఆమె తనకు పరిచయం లేకున్నా, సాయం చేయాలని ఆయన్ని అడగకపోయినా ముందుకు వచ్చి సాయం చేసిన సదరు నిర్మాతకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

అయితే, ఈ సాయం అందించిన నిర్మాత మరెవరో కాదని.. పలు హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న SKN అని తెలుస్తోంది. రేఖా బోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆయన చూసి ఆమెకు సాయం అందించాడని.. అయితే, ఈ విషయాన్ని ఆయన బయటకు చెప్పుకోలేదని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో SKN మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Exit mobile version