బిర్యాని రుచి కాస్త ఆలస్యంగా చూడనున్నామా ??

బిర్యాని రుచి కాస్త ఆలస్యంగా చూడనున్నామా ??

Published on Aug 13, 2013 10:00 AM IST

BIRIYANI-5
కార్తి నటించిన ‘బిర్యాని’ సినిమా సెప్టెంబర్ 6న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదలకుకావాల్సివుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల జాప్యం కారణంగా, అదే రోజు రామ్ చరణ్ ‘తుఫాన్’ విడుదల నేపధ్యంగా ఈ సినిమా విడుదల వాయిదాపడింది. ఈ చిత్ర విడుదల సెప్టెంబర్ చివరలో కానీ అక్టోబర్ మొదటివారంలో గానీ ఉండచ్చని అంచనా.

ఈ సినిమాలో కార్తి సరసన హన్సిక నటిస్తుంది. ప్రేమ్ జీ, మాండీ థాకర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కె.ఈ జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో చాల భాగాన్ని హైదరాబాద్ మరియు చెన్నైలలో తీసారు. ఒక రాత్రి బిర్యానీ కోసం బయటకు వెళ్ళిన వ్యక్తి జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాలను యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ విధానంలో తెరకెక్కించారు.

తాజా వార్తలు