క్రేజీ కాంబినేషన్ లో వెబ్ సిరీస్ ?

కరోనా, థియేటర్ల వ్యవస్థను దెబ్బ తీసినా.. డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కు మాత్రం బాగా ప్లస్ అయింది. ఈ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రోజురోజుకూ జనంలోకి చొచ్చుకొని పోయాయి. అందుకే జనం కూడా స్టార్ హీరో సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. పైగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లను కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్ లు జనంలోకి బాగా వెళ్లాయి. అందుకే కొందరు హీరోహీరోయిన్లు కూడా డిజిటల్ ఫిల్మ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తెలుగు – తమిళంలో ఒకేసారి ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి రెడీ అవుతున్నారట.

నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి మరియు టాలెంటెడ్ బ్యూటీ నభా నటేష్ కలయికలో ఓ సిరీస్ చేస్తున్నారని.. ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, మెయిన్ గా ఇద్దరి హీరోయిన్ల పాత్రల మధ్య వచ్చే రివేంజ్ సీన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇలాంటి కథాబలం ఉన్న వెబ్ సిరీస్ స్టోరీలో నటిస్తేనే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ హీరోయిన్లు ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించారని కూడా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Exit mobile version