‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ పై విమర్శలు.. ఫ్యాన్స్ సపోర్ట్ !

న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌నైట్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా నానితో స్టార్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే, ‘ది పారడైజ్’ నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్ అదిరిపోయింది. సినిమా పై ఆసక్తిని పెంచింది. అయితే, ఈ గ్లింప్స్ లో వాడిన పదజాలం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.

కాగా బూతు పదాన్ని, అందునా తల్లిని కించపరిచే పదాన్ని వాడటమేంటంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా, సినిమా కథ దృష్ట్యా ఈ పదం వాడి ఉండొచ్చని, మూవీ రిలీజయ్యే వరకూ విమర్శించడం సరికాదని నాని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version