ఆ హిట్ సీక్వెల్ కే లాక్ అయిపోయిన డైరెక్టర్ !

ఆ హిట్ సీక్వెల్ కే లాక్ అయిపోయిన డైరెక్టర్ !

Published on Aug 16, 2020 4:48 PM IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు, నాగ్ ఇతర పనులతో ఎప్పటికప్పుడు బిజీగా ఉంటూ ఉండటంతో… కళ్యాణ్ కృష్ణ మొత్తానికి రెండేళ్ల నుండి కేవలం బంగార్రాజు సినిమాకు మాత్రమే లాక్ అవ్వాల్సి వచ్చింది.

అయితే కరోనా అనంతరం కూడా ఈ సినిమా మొదలయ్యేలా కనబడటం లేదు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ కోసం నాగ్‌ బిజీగా ఉన్నాడు.
కరోనా తగ్గితే నవంబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేసి సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని కళ్యాణ్ కృష్ణ ప్లాన్ చేసినా ఇప్పుడు అది వర్కౌట్ అయ్యేలా లేదు. నాగ్ మాత్రం ప్రస్తుతం బిగ్ బాస్ తో బిజీగా ఉండనున్నారు.

ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం జూమ్ యాప్ లో కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తయ్యాయట.

తాజా వార్తలు