మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను లాక్ డౌన్ లో కూడా స్క్రిప్ట్ పనులను చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ కరోనాతో వచ్చిన బ్రేక్ ను బోయపాటి స్క్రిప్ట్ కు ఉపయోగించుకుంటున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా గురించి బోయపాటి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. ఇప్పటికే ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసామని.. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నామని బోయపాటి తెలిపారు. అలాగే అక్టోబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని కూడా బోయపాటి క్లారిటీ ఇచ్చారు.
ఇక నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో శ్రీకాంత్ ప్రటినాయకుడి పాత్ర చేయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ యేడాది డిసెంబర్ కి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.