స్పెషల్ సాంగ్ పై బోయపాటి ఫోకస్ !

akhanda 2

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడట. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని బోయపాటి ఈ సాంగ్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

Exit mobile version