త్రివిక్రమ్ తో తెర పైకి కొత్త కాంబినేషన్ !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ సినిమా చేస్తే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే అందరి హీరోల చూపు త్రివిక్రమ్ వైపే ఉంటుంది. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ కూడా త్రివిక్రమ్ – రామ్ చరణ్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కలయికలో సినిమా అంటే నిజంగా ఎంతో క్రేజ్ తో కూడుకున్నది కూడా. ఎప్పటికైనా త్రివిక్రమ్, రామ్ చరణ్ సినిమా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశ పడుతున్నారు. అయితే త్రివిక్రమ్ ఎప్పుడూ చరణ్ చేయడానికి కథను సిద్ధం చేసుకోలేదు.

కానీ మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఇప్పటికే ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా ప్లేస్ లో మహేష్ సినిమా వచ్చిందని.. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, చరణ్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం మహేష్ సినిమా మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట. పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందట.

అయితే సడెన్ గా మెగాస్టార్ సినిమాల వేగం పెంచడంతో.. త్రివిక్రమ్ ఇటీవలే ఆయనను కలిసి స్టోరీ లైన్ చెప్పాడని.. మెగాస్టార్ తో త్రివిక్రమ్ సినిమా ఖాయమని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఉన్నట్లు ఉండి త్రివిక్రమ్ – చరణ్ అంటూ తెర పైకి కొత్త కాంబినేషన్ వచ్చింది. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు. అయితే వీరి కలయికలో సినిమా రావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుంది.

Exit mobile version