ఇటీవల కాలంలో భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో పాటలు కథ ఫ్లోకు అడ్డుగా వస్తున్నాయని వాటిని ఫైనల్ కట్లో తొలగిస్తున్న ట్రెండ్ సాగుతుంది. అయితే, ఇదే తరహాలో మిరాయ్, దేవర, కింగ్డమ్ వంటి సినిమాలలో పాటలను తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా ఇదే ఫార్ములా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలో కూడా జరిగింది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఆమె పాటకు సంబంధించిన షూటింగ్‌ను బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. అయితే, ఈ పాట గురించి నేహా శెట్టి సినిమా రిలీజ్‌కు ముందు ఓ ఈవెంట్లో స్వయంగా చెప్పుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఓజీ చిత్రం రిలీజ్ కావడం.. అందులో నేహా శెట్టి పాట లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే, ప్రియాంక మోహన్‌తో ఉన్న ఎమోషనల్ ఎపిసోడ్ తర్వాత ఆ పాట రావడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయదనే ఉద్దేశ్యంతో ఆ పాటను తొలగించినట్లు తెలుస్తోంది. మరి ఈ పాటను తిరిగి సినిమాలో జోడిస్తారా లేదా అనేది వేచి చూడాలి. అభిమానులు మాత్రం ఓజీలో నేహా శెట్టిని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.