తాప్సీ నెగిటివ్ పాత్రలో కనిపించనుందా?

Tapsee

లక్ష్మీమంచు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘గుండెల్లో గోదారి’ మార్చ్ 8న విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాలో తాప్సీ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తను ఒక నెగిటివ్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది, నా పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని తాప్సీ అంది. 1986లో సంభవించిన గోదావరి వరదలను ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఒక ప్రేమ కథ అంతర్లీనంగా ఉంటుంది. లక్ష్మీమంచు, ఆది పినిసెట్టి, తాప్సీ, సందీప్ కిషన్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయారాజా సంగీతాన్ని అందించారు.

Exit mobile version