టాలీవుడ్ సెన్సేషనల్ హీరో ది విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రమే కింగ్డమ్. దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేది అనౌన్స్ చేసుకున్న ఈ సినిమా ఈ కొంతలోనే తన నుంచి ఓ ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. అయితే ఇందులో విజయ్ ఇచ్చిన ఓ స్టేట్మెంట్ చర్చకి దారి తీసింది.
తను ఓ దర్శకునికి ఆ స్క్రిప్ట్ లో లోపాలు ఉన్నాయని చెప్పలేను అని నాకు వెనక ఎవరూ లేరు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా లేదు. మరో హీరో తండ్రికి ఇన్ఫ్లూయెన్స్ ఉంది వాళ్ళు స్క్రిప్ట్ బాగోలేని పక్షంలో కోసం ఆ దర్శకుడు తో మాట్లాడగలరు. అనే స్టేట్మెంట్ పై గట్టి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే రచ్చ నడుస్తోంది. మరి కింగ్డమ్ హైప్ ఏమో కానీ విజయ్ ఈ స్టేట్మెంట్ తో మరింత వైరల్ గా మారిపోయాడు.