మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఫస్ట్ షెడ్యూల్ లో సెకెండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో షూట్ చేస్తున్నారు. సినిమాలో బాలయ్య రెండో గెటప్ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ లోనే రివీల్ అవుతుందట. ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఆ సీన్స్ నే షూట్ చేస్తునట్లు తెలుస్తోంది. అన్నట్టు మరో రెండు రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ముగుస్తోన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. అలాగే శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ఇకపోతే ఈ యేడాది వేసవికి సినిమా విడుదలకానుంది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.
కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.