నయనతార, త్రిష ఇప్పుడు ప్రాణస్నేహితుల జాబితాలో చేరిపోయారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10యేళ్ళు కావస్తున్నా తమిళ చిత్రసీమాను జంటనాయికలుగా యెలుతున్నారు. నిజానికి మొదట్లో వీరిద్ధరి మధ్యా వైరి వైఖరి కొనసాగేది. ఒకరి ప్రొజెక్ట్ మరొకరికి సొంతమైతే ఆ వార్త ప్రధాన వార్తగా నిలిచేది. కానీ వీరు మనస్పర్ధలుపక్కనపెట్టి కలిసి మెలిసి వుంటున్నారు
ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరూ “మేము ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం. నన్ను పూర్తిగా అర్ధంచేసుకునే వ్యక్తులలో ఈమె ఒకరు” అని నయనతార గురించి త్రిష తెలిపింది. ఒక పార్టీలో కలిసిన వీరి పరిచయం అమాంతం స్నేహంగా మరి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది
ప్రస్తుతం నయన్ చేతిలో తెలుగు, తమిళ భాషలలొ పెద్ద ప్రొజెక్ట్ లు వున్నాయి. శేఖర్ కమ్ముల అనామికలో, మారుతి-వెంకటేష్ ల రాధ సినిమాలో ఆమే ప్రధానపాత్రధారి. త్రిష ప్రస్తుతం దూకుడు కన్నడ రీమేక్ లో నటిస్తుంది