పూర్తీకానున్న నయనతార ‘అనామిక’

పూర్తీకానున్న నయనతార ‘అనామిక’

Published on Nov 13, 2013 4:52 PM IST

Anamika

నటి నయనతార నటిస్తున్న సుస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అనామిక’. ఈ సినిమాని బాలీవుడ్ లో హిట్ సాదించిన ‘కహాని’ సినిమాకి రిమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తైంది. కేవలం 4 – 5 రోజుల పని మాత్రమే మిగిలివుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎండేమోల్ ఇండియా బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాని రెండు బాషలలో నిర్మిస్తున్నారు. ఓరిజినల్ సినిమాని కాస్త మార్చి తెలుగు, తమిళ నెటివిటికి తగినట్టుగా అక్కడి అభిమానులకు నచ్చే విదంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆడియోని కొద్ది వారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ ట్రైలర్ ని నవంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నారని సమాచారం. శేఖర్ కమ్ముల తన కెరీర్ లో మొదటి సారిగా ఈ సినిమాని రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా తను ఇప్పటివరకు తీసిన సినిమాలకు డిఫరెంట్ గా ఉండనుంది.

తాజా వార్తలు