తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార

తెరను మిస్ అవుతున్న అని చెప్పిన నయనతార

Published on Feb 4, 2012 10:23 AM IST


కొన్ని రోజుల విరామం తరువాత నయనతార తెర మీద మళ్ళి కనిపించబోతున్నారు ఇటీవల ఒక జాతీయ దిన పత్రికతో ముచ్చటిస్తూ చిత్ర పరిశ్రమను బాగా మిస్ అయ్యాను అని ఇన్ని రోజుల అవిరామం తరువాత కూడా తెలుగు ప్రజలు నన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారని అన్నారు. కామాక్షి మూవీస్ బ్యానర్ మీద నాగార్జున సరసన చేస్తున్న చిత్రం గురించి మాట్లడుతూ “ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్, చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ మరియు అమెరికాలలో జరుపుకోనుంది” అని చెప్పారు. ప్రముఖ నృత్యదర్శకుడు, దర్శకుడు మరియు నటుడు అయిన ప్రభుదేవా తో సంబంధం తెగిపోయిన తరువాత నయన తార తన దృష్టి మొత్తం పని మీద సారిన్చినట్టు తెలుస్తుంది . ప్రస్తుతం కోచి,కేరళ లో ఉన్న ఈ భామ “ఇక్కడ నీరుని చూస్తూ గడపటం చాలా ఆనందంగా ఉంది కోచి నివసించడానికి అద్బుతమయిన ప్రదేశం ఇక్కడ సెలవులని బాగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు

తాజా వార్తలు