‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ పై లేటెస్ట్ బజ్!

Published on Oct 28, 2025 9:01 AM IST

Akhanda2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అంతే కాకుండా ఇటీవల వచ్చిన కొత్త టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక నెక్స్ట్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే. మరి దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది.

దీని ప్రకారం మేకర్స్ మొదటి పాటగా పవర్ఫుల్ టైటిల్ సాంగ్ ని లాంచ్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నవంబర్ మొదటి వారంలో ఈ సాంగ్ వచ్చే ఛాన్స్ ఉందట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు