మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్

మరోసారి కోల్ కత్తా వెళ్లనున్న రామ్ చరణ్

Published on Oct 7, 2012 6:12 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయక్’. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ అక్టోబర్ 12 నుండి కోల్ కత్తాలో ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఈ చిత్రం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. రామ్ చరణ్ మరియు అమలా పాల్ కలిసి బైక్ పై వచ్చి మల్టీప్లెక్స్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసే సన్నివేశాలను నిన్న కొంపల్లిలో చిత్రీకరించారు. ఆ సన్నివేశాలతో హైదరాబాద్ జరుగుతున్న షెడ్యూల్ పూర్తయ్యింది. అక్టోబర్ 12న మొదలు కాబోయే షెడ్యూల్ కోసం త్వరలోనే ఈ చిత్ర టీం కోల్ కతాకు పయనం కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు