రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్న నా రాకుమారుడు హీరో

రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్న నా రాకుమారుడు హీరో

Published on Mar 12, 2014 11:41 PM IST

Naveen_Chandra
‘నా రాకుమారుడు’ సినిమాలో హీరోగా నటించిన నవీన్ చంద్ర తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడైన అజయ్ వోధిరాల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అనురాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె రఘుబాబు, కె.బి చౌదరి నిర్మిస్తున్నారు

ఈ సినిమా ఈరోజు హైదరాబాద్ లో సుకుమార్ చేతులమీదుగా ప్రారంభమయింది. ఈ కొత్త దర్శకుడి పనితీరుని సుకుమార్ మాట్లాడుతూ “అజయ్ మా బృందంలో క్వాలిటీ ఇన్స్పెక్టర్ లాంటి వాడు. మేము ఏ పనైనా పూర్తిచేయాలి అంటే అతని ఆమోదముద్ర తప్పనసరి” చెప్పాడు. ఈ సినిమా హీరో మాట్లాడుతూ “అందాల రాక్షసి, దళం మరియు నా రాకుమారుడు సినిమాలలో నటించిన తరువాత ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించడం ఆనందంగా వుంది” అని తెలిపాడు

ఈ సినిమాలో నివేద థామస్ హీరోయిన్. మార్చ్ 22 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. రతీష్ వేగా సంగీతదర్శకుడు

తాజా వార్తలు