జనవరిలో రానున్న నాటి బోయ్స్

జనవరిలో రానున్న నాటి బోయ్స్

Published on Nov 20, 2012 2:04 AM IST


ఆర్య,హన్సిక మరియు అంజలి ప్రధాన పాత్రలలో రానున్న “నాటి బాయ్స్” చిత్రం జనవరిలో విడుదల కానుంది.కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూటివి మోషన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. “ఢిల్లీ బెల్లి” చిత్రానికి రీమేక్ అయిన “సెట్టై” చిత్రాన్ని తెలుగులో “నాటి బాయ్స్” అనే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారు.70% చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో సంతానం మరియు ప్రేమ్గి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. “నాయక్”,”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” వంటి తెలుగు చిత్రాలతో పాటు కార్తి హీరోగా “బాడ్ బాయ్” ఆర్య,అనుష్క ల “బృందావనంలో నందకుమారుడు” వంటి డబ్బింగ్ చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇంత పోటీ మధ్యన రానున్న “నాటి బాయ్స్” బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు నెగ్గుకురాగలదో చూడాలి.

తాజా వార్తలు