మోనాల్ గజ్జర్ తో రొమాన్స్ చేయనున్న నారా రోహిత్

మోనాల్ గజ్జర్ తో రొమాన్స్ చేయనున్న నారా రోహిత్

Published on Dec 26, 2012 11:16 AM IST

nara-rohit-and-monali-gajja
యంగ్ హీరో నారా రోహిత్ తన రాబోయే సినిమాలో మోనాల్ గజ్జర్ తో జోడీ కట్టనున్నాడు. ఈ సినిమాని నిర్మాత డి.ఎస్ రావు తో కలిసి శ్రీ శైలేంద్ర మూవీస్ కార్పోరేషన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమాతో పరిచయమైన మోనాల్ గజ్జర్ ఇటీవలే ఓ తమిళ సినిమా ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా కార్తికేయ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. నారా రోహిత్ హీరోగా నటించిన ‘ఒక్కడినే’ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. ఎక్కువభాగం 2013 మొదట్లో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు