ప్రత్యేకం : రవితేజ చిత్రంలో నారా వారి అబ్బాయి

ప్రత్యేకం : రవితేజ చిత్రంలో నారా వారి అబ్బాయి

Published on Oct 21, 2012 1:46 PM IST


మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో వస్తున్న “సార్ వస్తారా?” చిత్రంలో యంగ్ హీరో నారా రోహిత్ ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక ముఖ్యమయిన పాత్రలో కనిపించనున్నారు కథలో ఈ పాత్ర కీలకం కానుంది. ఒకే తెర మీద నారా రోహిత్ మరియు రవితేజలను చూడటం ఆసక్తికరమయిన అంశం. కాజల్ అగర్వాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు ఈ చిత్రంలో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నారు. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద గత కొంతకాలంగా అపజయాల్నే చూస్తున్న రవితేజ ఈ చిత్రంతో తన అదృష్టం మారుతుంది అని అనుకుంటున్నారు. నారా రోహిత్ రవితేజకి అదృష్టంగా మారుతాడేమో చూడాలి.

తాజా వార్తలు