కృష్ణచైతన్య దర్శకత్వంలో రౌడీ ఫెల్లో గా నారారోహిత్?

కృష్ణచైతన్య దర్శకత్వంలో రౌడీ ఫెల్లో గా నారారోహిత్?

Published on Nov 16, 2013 3:00 AM IST

Nara-rohit

కృష్ణచైతన్య దర్శకత్వంలో నారారోహిత్ ఒక సినిమా చేస్తున్నాడు. గతంలో కృష్ణ చైతన్య బృందావనం, ఇష్క్, బాద్ షా, ఎవడు వంటి సినిమాలకు పాటలను రాసాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్న ఇతను సినిమా పేరును ‘రౌడీ ఫెల్లో’ అని పెట్టే ఆలోచనలో వున్నారు. ఎటువంటి అధికారిక ప్రకటనా ఇంకా రాలేదు

ఇటీవలే రోహిత్ పై కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ‘ఫక్రే’, ‘కన్నా లడ్డూ తిన్నా ఆసియా’ సినిమాలలో నటించిన విశాఖ సింగ్ ప్రధానపాత్ర పోషిస్తుంది. నందినీ రాజ్ రెండో హీరొయిన్. ‘స్వామి రారా’ సినిమా నిర్మాత చక్రి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సున్నీ సంగీతదర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ సినిమానే కాక నారా రోహిత్ నటించిన ప్రతినిధి త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు