‘ఈగ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నాని హీరోగా, ‘శంభో శివ శంభో’ చిత్రాన్ని తీసిన తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘జెండా పై కపిరాజు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. అలాగే ఈ చిత్రంలో నాని సరసన అమలా పాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత కె.ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ సరికొత్త కథ మరియు కథనాలతో తెరకెక్కించనున్న నాని చిత్రానికి ‘జెండా పై కపిరాజు’ అనే టైటిల్ ని ఖరారు చేశాం. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. ఆగష్టు 1 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని’ ఆయన అన్నారు. వాసన్ విజువల్స్ వెంచర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ పాటల రచయిత అనంత్ శ్రీ రామ్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు.